మనసు పలికే...
మనసు పలికే...
వెలుగు వాకిట కరిగిన కలలవనమిది తెలుసునా.....
కలుగుతున్న సందేహమైన ఉనికికై మొదలాయెనా....
వెతలు ఊరిన బ్రతుకున..........
జతను వెతుకుతూ సాగేనా...........
కరుణనొసగని కరుణా సముద్రుని వేడినా...........
కర్మ వీడదు నీడలాగా జీవితం కొనసాగునా...........
ఎదుటపడమని ఒక మనస్సును వేడుకోలు చేసిన....
కుదుటపడకని మనసు వేదన వీడుకోలు పలుకునా..
మధురోహలే తనువు మనసును ఎంతగా విభజించినా...........
మరువలేని బాధలన్నీ మెదడునే గుణియించెనా....
వచ్చేనా ఓ రోజైనా సంకలనం చేయనిచ్చేనా...........
ఆత్మబలమే నిక్కముగా జయించేనా...........
హృదయ పరిమళమే స్వయముగా పరిఢవిల్లేనా.....

