STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనిషికి అర్థం

మనిషికి అర్థం

1 min
2



మనిషికి అర్థం నేడు మారిపోయెరా
మనస్సు వదిలేసి మారమనిషాయెరా 
ఎందుకింత మారిపోయిండో ఈ మనిషి...
ఆ మార్పు ఎటు తీసుకెళ్తుందో తెలియక పోయేరా..

స్వార్థమనే సింహం పై స్వారీ చేస్తూ...
తనలోని అస్థిత్వాన్ని తానే కోల్పోతున్నాడు
ప్రేమను మరిచాడు, బంధాలు విడిచాడు...
కనిపించని పరుగులోన కలవరపడుతున్నాడు
గుండెల్లో తడి లేని, కరుణ లేని లోకాన...
నరరూప రాక్షసుడిలా మారిపోతున్నాడు 

మనస్సే లేని మనిషి లాగా
రోజూ ఒక యంత్రంలా జీవనం సాగిస్తున్నాడు
నవ్వులను మరిచాడు, కన్నీళ్లు దాచాడు...
కృత్రిమ లోకంలో బందీ అయిపోతున్నాడు
మనిషిగా పుట్టాక మానవత్వం లేకపోతే...
ఈ భూమిపై బ్రతుకునకైనా అర్థం ఉందా రా... |


Rate this content
Log in

Similar telugu poem from Classics