STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

మెఱుపుతీగ

మెఱుపుతీగ

1 min
11



ఊహలెన్నొ ఊరిస్తూ..పండించును మెఱుపుతీగ..! 
విశ్వమైత్రి వేడుకయే..జరిపించును మెఱుపుతీగ..!

హృదయగగన వీధులెల్ల..విహరించగ తోడు తనే.. 
చైతన్యమె మిఠాయిలా..వడ్డించును మెఱుపుతీగ..! 

నీలిమేఘ మాలలతో..ముచ్చటించు శక్తినిచ్చు.. 
దివ్యప్రేమ గీతాలను..పలికించును మెఱుపుతీగ..!

పెదవులింటి గోరింటకు..నిత్యసుధా మాధురియే.. 
నటభైరవి రాగంలో..పొంగించును మెఱుపుతీగ..! 

అంతరంగ హంసధ్వని..సాక్షియైన సుందరిరో.. 
మౌనవీణ తంత్రులింట..వర్షించును మెఱుపుతీగ..! 

ఎంతముగ్ధ మోహినియో..తృటిలోనే మాయమౌనె.. 
వీడలేని నాటక చెఱ..విడిపించును మెఱుపుతీగ..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance