మెలకువ
మెలకువ
వెలుగురేఖలు జగాన్ని తట్టి మేలుకొలుపువేళా
కాలస్వరూపoచీకటి తెరలను చీలిచ్చి
వెలుగుల గడపకు అడుగిడు వేళా
కలకు మెలకువకు బేధం తెలియని స్థితిలో
స్వప్నాల ఊయలలో నిదురమత్తులో జోగుతూ
నీవేమిటో నీకే అంతుపట్టని అజ్ఞానంలో జోగుతున్న
ఓ మనిషీ నీ గురించిన ఎరుకలోకి రా.. లే లే
ఈ లోకంలోజన్మ ఎత్తిన ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంటుంది
తాను జీవిస్తూ పరుల బాగుకై బతికితే అంతకన్నా
మానవజన్మకు ప్రయోజనం ఏమున్నది
నిత్యం నేను నేననే అహం లోకాలుతూ
స్వార్ధమే పరమార్థం మనే అజ్ఞానపుకౌగిలిలో నలుగుతూ
మాయామోహపువలలో చిక్కి అదే నిజమని నమ్ముతూ
నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విస్మరించి
నీకు నీవే రాజు మంత్రివని అనుకుంటూ
అంతరాత్మ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ
కన్ను మిన్ను గానకపెడత్రోవలతొక్కుతూ
పయనిస్తూ నిన్ను వెన్నంటి పయనించే మృత్యునీడ కానక
చివరాఖరి పయనంలో నీకై
నలుగురు మనుషులనుకూడేసుకోలేని
నీ జన్మకు అర్దం,ప్రయోజనం ఏముందోయి
