STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మౌనం

మౌనం

1 min
299

నిప్పుగొంతు మౌనంగా లిఖియిస్తూ ఉన్నదిలే.!

గాలిగుండె విప్లవాన్ని రగిలిస్తూ ఉన్నదిలే..!


మదిలోపలి భావాలకు మంచివేదిక ఇదేమరి..!

తెలుగు గజల్ గుండెగొంతు వినిపిస్తూ ఉన్నదిలే..!


అద్దమంటి తనమనసున చోటు కాస్త దొరికెనుగా..!

నా మువ్వల సవ్వడులను రక్షిస్తూ ఉన్నదిలే..!


అక్షరాల తోటలోన గున్నమావి తన హృదయం.!

నా గుండె కోకిలనే పలికిస్తూ ఉన్నదిలే..!


సమాజమున ఇజాలెన్ని తీరులుగా ఎగిరేనో ..!?

తన శైలితొ అన్నిటినీ మరిపిస్తూ ఉన్నదిలే..!


జాఢ్యాలకు చరమగీతి పాడాలట కవిగీతం..!

మార్పు గూర్చి తన చింతన సాగిస్తూ ఉన్నదిలే..!


కలతచెందు కవికలముకు నెమ్మదించ తోడుండును..!

ఆందోళన వీధి నుండి తప్పిస్తూ ఉన్నదిలే..!


మట్టిగుండె గొంతు తనది..మెతుకు గొడవ తానెరుగును..!

ఆవిరయే నీరుమల్లె ప్రబోధిస్తు ఉన్నదిలే..!


పలుకువీణ తనువైతే మనసేమరి వేణువౌను.!

మౌనమధుర రాగాలను కురిపిస్తూ ఉన్నదిలే..!


కొమ్మలలో కోకిలమ్మ ఆవేదన తనకు తెలుసు..!

చివురులలో ఆ మధురిమ వడ్డిస్తూ ఉన్నదిలే..!


ప్రేమవిలువ తెలియలేక తల్లడిల్లు మనసు నాది..!

మైత్రి గొడుగు తాను పట్టి నడిపిస్తూ ఉన్నదిలే..!


చిరు గరికకు పాలు నింపు ప్రతిభ తనది..!

తాపాలను బుజ్జగిస్తు లాలిస్తూ ఉన్నదిలే..!


చిలిపి మెరుపు వీణియమది యుగాలుగా మీటుతోంది..!

తెలుపరాని మధువులతో ఊరిస్తూ ఉన్నదిలే..!


పాడరాని సిగ్గుమొగ్గ పరువాలకు తొలకరి మరి..!

వెన్నెలింటి పరదాలను తొలగిస్తూ ఉన్నదిలే..!


తృప్తింటను కాపురమే కోరువాడు

పట్టుబడని సత్యాన్నే ప్రకటిస్తూ ఉన్నదిలే..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational