మౌనం
మౌనం
నువు పక్కనుంటే వరదగోదారే నేను లేకుంటే...
ఎడారి ఎండమావినవుతాను...
నువు నాతో నడుస్తూవుంటే...
పూదోట విరిసేను మదిలోను రావని తలిస్తే...
పిడుగుపాటు నాలో కలిగేను...
మౌనంలో మగ్గిపోవద్దలా...
చీకట్లో ఉండిపోవద్దిలా...
నేనున్నాగా సంతోషాల వెల్లువలా...
తోడుంటాగా నీవేణువుకి వాయువులా...
నీతోవస్తా చీకటిలో చిరుదివ్వెలా...
పిలుపునివ్వు రివ్వునవాలతా పక్షిలా...
సైగచేయి కాపుకాస్తా కళ్ళల్లో వత్తిలా...
దిగులుతోస్తే తలదిండై నిద్రపుచ్చుతా
తట్టుకోలేనీ తలపుల వెల్లువని
ముంచిపోనీ నిలువెల్లా నీ వలపుల ఉప్పెనలోని
సాగిపోనీ వరద వానలలోని
ఆగిపోనీ నా ఊపిరి గాలులని..
సుఖాల జావళి
పాడుతోంది మదిలోగిలి
జాగేల నాతో ఆడరావేల కోలాటాలకేళి
నీకై వేచింది ఎదపందిరి......
... సిరి ✍️❤️

