మాధవుడు
మాధవుడు
మత్తేభము.
ధరకేతెంచెను (మా)ధవుండు కరుణన్ ధర్మంబులన్ నిల్పగన్
వరమై నిల్చెను భూ(ధ)రుండు లలితో భారంబులన్ దీర్పగన్
బురుషోత్తంబుడు శ్రీధ(వుం)డు నగుచున్ బోధించె నా 'గీత'లన్
బరమాత్ముండిదె వచ్చినా(డు )వినతిన్ బ్రార్థించ మోక్షంబునిడున్ //
మొదటి పాదం - 7 వ అక్షరం
రెండవ పాదం - 8 వ అక్షరం
మూడవ పాదం - 9 వ అక్షరం.
నాలుగవ పాదం - 10 వ అక్షరం.
భావం :ధరకు వచ్చిన మాధవుడు ధర్మాన్ని నిలిపాడు, భారములు తీర్పాడు. గీతను బోధించాడు. ప్రార్థిస్తే మోక్షాన్ని ఇస్తాడు.
