కవిత్వం
కవిత్వం
*కవిత్వం*
(కవిత )
అసలు సిసలు కవిత్వం
అక్షర పద విన్యాసం
అసలు సిసలు కవిత్వం
కరవాలం కంటే పదునైన ఆయుధం
వేదాలకంటే పూర్వం వెలిగిన దివ్య తేజం
ఋషి పరంపరగా సాగిన యజ్ఞం
గురుకులములందు ఉపనిషద్సారం
పురాణేతిహాస, శాస్త్ర విజ్ఞానం
కులమన్నది గణియించని మహోన్నత సంస్కారం
విలువలు నేర్పించు పెన్నిధి యీ కవిత్వం
బోయవాడు పలికినా నాయకుడు పలికినా
వెఱ్ఱివాడు పాడినా, వేటగాడు పాడినా
తరతరాలు నిలిచిపోయి తలరాతలు మార్చిందే
అసలు సిసలు కవిత్వం.
పోరాటాలు తెలిపింది, పుణ్యకథలు తెలిపింది
చరిత్రను తెలిపింది జగతి కొఱకు నిలిచింది
మానవాళికి జ్ఞానభిక్ష పెట్టింది. మంచి తనము నేర్పింది
బడుగు వారి భయాలను తొలగించగ పూనుకొంది
బాసటగా నిలిచింది, భవితను వెలిగించింది
శాంతి వచనాలు పలికింది, రుధిర జ్వాలలు కురిపించింది
నిరంకుశత్వము నిరసించింది నిత్యనూతనమై ప్రభవించింది
ప్రజా హృదయాను రాగమై నినదించింది
విజయాలను చవి చూసింది
అసలు సిసలు కవిత్వం అజరామరమై నిలిచింది.
*********
