కవిత గొప్ప
కవిత గొప్ప
ప్రపంచాన్ని వర్ణించే కవిత,తొలగించును మనసుల్లో కలత.
పెంచును మనుషుల్లో మమత,
సాధించును సమాజంలో సమత.
కవితకున్నది ప్రాచీన చరిత్రత,
కదిలిస్తున్నది మనలోని పవిత్రత.
వర్ణిస్తున్నది సుగుణాల సుభాషిత,
చూపిస్తున్నది రేపటి భవిత.
ప్రతీ కవిత యొక్క భావన:
నా పదాలలో కనబడత,
పాఠకుల స్వరాలలో వినబడత.
రచయిత చేతిలో కలమౌత,
సాహిత్య రంగంలో కులమౌత.
తిరిగొస్తాను ఈజగమంత,
అనిపిస్తాను ఒక్కటే మనమంత.
-వెంకట్
