STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కొత్త పదం

కొత్త పదం

1 min
4


ఘడియకో వేషం,

నిమిషానికో నైజం,

అవసరానికొక స్నేహం,

ఆడంబరానికో బంధం!


పలకరింపులో ధరహాసం,

ప్రక్కకు తిరిగి పరిహాసం,

అణువణువునా అసూయా ద్వేషం,

ఆప్యాయత కేవలం అలంకారం!


వెన్నపూస లాంటి మాటలు,

వెన్ను పోటు తూటాలు,

ఓర్వలేని కల్మషాలు,

ఓదార్పు వెనుక విషం గ్రక్కే నాల్కలు!


స్వార్థం రుధిరంలో మిళితమై,

స్వలాభమే అంతిమ లక్ష్యమై,

సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి,

సత్సంబధాలకు సమాధి కట్టేసి,

సృష్టిలో ఉన్న వికారాలన్నిటి స్వరూపమై,

క్షణికమైన క్షుద్రానందంలో సేద తీరుతున్న

ఓ మనిషీ !నిన్నేమని వర్ణించాలి?

రాక్షస ప్రతిబింబమనా?

రాబందుల వారసత్వమనా?

మానవత్వం మరిచిన మృగమనా?

మానసిక దౌర్బల్యమనా?

పోలికలతో అవమానించొద్దంటూ

పశుపక్ష్యాదులన్నీ మొత్తుకుంటుంటే 

మరేదన్నా కొత్త పదం కావాలిప్పుడు!

కొత్త పదం 


Rate this content
Log in

Similar telugu poem from Romance