STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కనుమరుగైన బంధాలు...???

కనుమరుగైన బంధాలు...???

1 min
4



బంధలన్నీ బతికే ఉన్నాయి... 
బంధుత్వమే చనిపోతోంది
ఇంటి నిండా మనుషులు ఉన్నా... 
మనసు మాత్రం ఒంటరై పోతోంది 
అవసరం అంతవరకే అడుగులు వస్తాయి...
 అవసరం తీరగానే దారులు మారిపోతున్నాయి...
కన్నీటి విలువ తెలియని లోకంలో... 
కలిసిన రక్తం కూడా పరాయై పోతుందే

ఒకప్పుడు గుమ్మం నిండా నవ్వులు ఉండేవి... 
ఒకరి బాధని అందరూ పంచుకునే వారు
ఇప్పుడు నవ్వులు ఫోటోలలో మిగిలిపోయాయి... 
మనుషులు మాత్రం నటనలో మునిగిపోయారు
చేతివేళ్లు వేరైనా కలిసే ఉంటాయి... 
బంధాలు కూడా అంతే అనుకున్నాను
కాలం కాదు అవసరమే మనుషుల్ని మార్చేస్తుంది
చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను

డబ్బు ముందు ప్రేమ ఓడి పోయిందే... 
హోదా ముందు ఆప్యాయత తల్లవంచేసింది
మనిషిని కాదు అతని పరిస్థితిని ప్రేమించే రోజులు వచ్చాయి
నీడలా వెంట ఉంటా మన్న వాళ్ళు... ఏండొచ్చే సరికి కనిపించ్చరే
నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే మనవాళ్ళు... పడిపోతే చేతులు అందించ్చరే

చెట్టుకి పండు ఉన్నంత వరకే రాళ్లు పడతాయి... 
మనిషికి ఉపయోగం ఉన్నంత వరకే పలకరింపులు వస్తాయి
గాయం చేసిన వాళ్ళు పరాయి వాళ్ళు కాదు... 
మనవాళ్ళేనాని నమ్మిన వాళ్లే కన్నీళ్లు కళ్ళలో నుంచి రావు...
 నమ్మకం చనిపోయిన చోట నుంచి వస్తాయి..
కాలం నేర్పిన గొప్ప పాఠం ఒక్కటే... 
అందరూ మనవాళ్ళు కావచ్చు, కానీ అందరికీ మనం మన వాళ్ళం కాదు
బంధుత్వం రక్తంతో పుడుతుంది కానీ ప్రేమతోనే బతుకుతుంది...
 ప్రేమ చనిపోయిన చోట బంధాలు కూడా శవాలే...!!!


Rate this content
Log in

Similar telugu poem from Classics