కళ్యాణం
కళ్యాణం
మూడుముళ్ల బంధం ముచ్చటైన బంధం
ఏడడుగుల బంధం ఏళ్ల నాటి బంధం
కమనీయమైనదీ శుభ ముహూర్తం
వధూవరుల ప్రథమ వీక్షణమే మనోహరం
మరల మరల రానిదీ మధుర క్షణం
మమతతల సౌరభం చిలికించు నిమిషం
వలపుల తోరణం మాంగల్య దారణం
సౌభాగ్య చిహ్నమీ సూత్రప్రబంధం
కలిపి కట్టు నిరువురినీ నూరేళ్ళ కాలం
చెలిమికి శ్రీకారం విడిపోని మమకారం
బాధ్యతను పెంచుతుంది వహ్ని ప్రదక్షిణం
నవజీవన యానం సప్త పదితో నారంభం
ఆదర్శ వంతమైన అరుంధతీ నక్షత్ర దర్శనం
ఆలుమగలకు తెలుపుతుంది పుణ్యచరితం
ప్రణయ రాగరంజితం పరువంపు శోభనం
తొలిరేయి మాధుర్యం సుధారాగమోహనం
ప్రతి జంటకు కళ్యాణమొక మరపురాని జ్ఞాపకం
మనసు మనసు కలిస్తే పరిమళించు దినం దినం
దాంపత్యమొక నవరసాల సమ్మేళనం
సహనంతో చరిస్తే అదే అదే భువిలో స్వర్గం
నిరసనతో మొదలైతే నిత్యమొక నరకం
కలిసియున్న వసంతం విడిపొతే వైరాగ్యం.
******************
