కలలు
కలలు
కనుల గడప దాటెనే కలలు
కడలి ఒడిని వీడవే అలలు
కరిగి కరిగి రేయి చిక్కదనాలు.
తూరుపింట లేత కిరణాలు
కోరుకున్న చిరు పవనాలు
మరువలేని నా జ్ఞాపకాలు
ఉదయవీణ మీటిన రాగాలు
కన్నుల్లో మెలకువల సరికొత్త సంద్రాలు
దిశలోనే సాగాలి అరుదైన విజయాలు
ముడిని వేసే అందమైన బంధాలు
మనసు బట్టే నిజమైన సంతోషాలు !!

