కళాఖండం:::::శ్రీనివాస భారతి
కళాఖండం:::::శ్రీనివాస భారతి


నీ అందాలు
నాలో కోర్కెలు రేపుతున్నా
నా మనసు
ఇంకెక్కడికో తీస్తోంది పరుగు
నీ నగ్నత్వం
నాకళ్లముందు స్పష్టంగా పరిచినా
నా దృష్టి నీ చిత్రం పైనే
నీ ఆనందం కోసం గీసిన ఈ చిత్రం
నీ కెందుకు నచ్చలేదో మరి
విసరి కొట్టావు...
అది నా కంటిపాప
నీ యవ్వన మిసమిసలు
రెచ్చగొట్టే పరువాలు
కుర్రకారుకు ఆనందమేమో గాని
నాకో అద్భుత కళాఖండం
నీకు నచ్చని నీ చిత్రం
డాలర్లు కురిపిస్తోందిక్కడ
నీ దగ్గరున్న రేఖా చిత్రం
నా సంతంకం లేనప్పుడు
కేవలం అలంకార ప్రాయం.
◆◆◆◆◆>©©©©©©©©©◆◆◆◆◆