జవాబు చెప్పు!
జవాబు చెప్పు!
జవాబుచెప్పు!...
ద్విరదగతి రగడ )
ఏడడుగుల బంధంబెఱుగలేవా నీవు?
తోడుగా నుండకే తొలగిపోతున్నావు!
కాలంపు పరుగులో కాఠిన్యమెందుకో?
ఆలినే మరిచావ? అలసత్వమెందుకో?
వలపుమాటలు లేవు!పలకరింపులు లేవు!
చిలిపిసరసంబెచట? చిరునవ్వులే లేవు!
వేదనలు మ్రింగాయి!బెంగలే కుదిపాయి!
బాధలే ముంచాయి!భయాలే పెరిగాయి!
చాలు సఖా!నాకిక సహనంబు లేదోయి!
వీలయితె నొకసారి వివరింప రావోయి!
జవాబేమిటి చెప్పు!చాటుమాటెందుకో?
జీవమిచ్చట పోవ చింతలేదెందుకో?
సహధర్మచారిణిని సంసారమున నీకు
అహరహమూ తోడుగ ననుగమించే నాకు
పరీక్షపెట్టకుమా!భరియించలేనోయి!
పరితాపము చాలును పరుగుతో రావోయి!//
