జీవితం...
జీవితం...
జీవితంలో కొన్ని బంధాలు ఉంటాయి
ఎప్పటికీ తెంచుకోలేము!!
కొన్ని ప్రశ్నలు ఉంటాయి..
బదులు ఇవ్వలేము!!
కొన్ని త్యాగాలు ఉంటాయి..
వాటికీ వెల కట్టలేము!!
కొన్ని కోరికలు ఉంటాయి..
చంపుకోలేము!!
కొన్ని తప్పులు ఉంటాయి..
దిద్దుకోలేము!!
కొన్ని అపజయాలు ఉంటాయి..
జయించలేము!!
కొన్ని ఋణాలు ఉంటాయి..
తీర్చుకోలేము!!
కొన్ని ఆనంద క్షణాలు ఉంటాయి..
మరువలేము!!
కొన్ని చెదిరిపోని జ్ఞాపకాలు వుంటాయి..
తిరిగి తెచ్చుకోలేము!!
అలుపెరుగని పోరాటం తో మొదలయ్యి
పోరాటంతో ఆంతమయ్యేదే జీవితం....
- ... సిరి ✍️❤️

