ఇంకేల
ఇంకేల
నీ తలపు 'టీ'ముందు..అమృతమా ఇంకేల..!?
ఈ ప్రమిదలో మరో..తైలమా ఇంకేల..!?
నా మనసు తెలుసుకొను..వారెవరు నీకన్న..
నీచూపు వానలో..ఛత్రమా ఇంకేల..!?
నీప్రేమ వనసీమ..తోడుంది ఎదలోన..
జగతిపై విడలేని..మోహమా ఇంకేల..!?
ఒకలేఖ వ్రాయగా..దొరకవే పదములే..
నీ వలపు వెలకట్టు..గీతమా ఇంకేల..!?
ఈ మనో వీణలో..రాగాలు శతకోటి..
మురిపించు వెన్నెల్ల..పరువమా ఇంకేల..!?
నీ ప్రేమలో కరుగు..ఒక మంచు ప్రతిమనే..
నా విరహ వేదనకు..శిల్పమా ఇంకేల..!?
