ఈ ఉషోదయం
ఈ ఉషోదయం
మనం లేచే ప్రతి ఉదయపు ఉషోదయం
మనకో కొత్త వసంతాన్ని చూపిస్తుంది....!!
అందమైన అమ్మాయి దోర చిలిపి నవ్వుల
పువ్వులు విరబూసి నట్టు....!!
ఆ నవ్వు ఎంత అందంగా ఉంటుందో
ఆ వేకువ చల్లనిగాలి కూడా అంతే
పరవసాన్ని చవి చూపిస్తుంది...!!
అందుకే మన మదిలో ఏదో తెలియని
మందహాసం మన పెదవుల్లో చిగురిస్తుంది
ఈ చల్లని ఉషోదయాన...!!

