ఈ ఉషోదయం
ఈ ఉషోదయం
ఈ ఉషోదయం.........
పల్లవించె నా హృదయం.......
ఊహల సరిగమలో........
ఊరేగే ఊర్వశినై........
ఊపిరి ఊయలలో.........
ఊగే ఉత్సాహమై........
ఉత్తుంగ కెరటం.........
నింగి తాకు ఆరాటం........
నాలో చూసే వేళ.........
ఈ భువి ముద్దుగుందే చాలా.........
ఒంటరి ఆకాశం.........
ఆ తారల సందేశం........
అందుకునేదెలా ?
సూరీడే కబురంపాలా........
గుప్పెడు గుండెల్లో నిండిన సంతసమే.........
ఉప్పొంగు సంద్రం అయ్యేలా.........
యామిని దాటిన అవనిలో.........
సుప్రభాత ఆమనీ.........
చిరు కోయిల పాటల్లో........
నీవే మునగాలని........
సాగే నా పయనంలో.........
జ్ఞాపకమై నిలవాలని.........
పరిచా నా హృదయ మధురిమా !!
అద్భుత ప్రియ సాంగత్యమా !!

