STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ జన్మకే

ఈ జన్మకే

1 min
227

దూరానవున్న బంధాన్ని తలచుకోవాలా...

దగ్గరగావున్న జ్ఞాపకాలనా...

వేలుగావున్న అడుగులదూరాన్నా...

వేరుపడని ఆశలచేరువనా...

వెలుగుతున్నా చేరలేని సూర్యకిరణాన్నా...

మబ్బులు కమ్మి తడిపేస్తున్న తలపులవాననా...

ప్రతితలపూ నీదే...

గుండెసవ్వడిలో శ్వాసా నీవే...

నే చూసేదంతా కలిపి నువ్వైపోతుంటే...

దగ్గరకాలేని దూరాన్ని...

దూరమవ్వని దగ్గరితనాన్ని...

ఆనందంగా స్వీకరిస్తున్నా...

ఈజన్మకే సుమా..


..‌‌‌‌‌


Rate this content
Log in

Similar telugu poem from Romance