గోమాత
గోమాత
గోమాత
తల్లి వంటిది మన గోవు
తలుచుకొనుమా!నీవు
పాల ధారల నిచ్చును
పాపలాకలి తీర్చును
భరత భూమికి వేలుపు
భావితరముల నిలుపు
గోవు సంతతి వర్థిలగా
జీవితంబులు వెల్గుగా
పొలము లందున కోడెలు
కడుపు నింపెడి జీవులు
పంచగవ్యము మేలుగా
ప్రాణభిక్షను పెట్టుగా
పల్లె కొసగును జీవము
పైరు కెపుడు రక్షణము
గ్రాసమును మేయుచుండు
కలిమిని కురియుచుండు
సకల దేవతా స్వరూపము
సత్త్వగుణముకు మూలము
తుదకు వెంట వచ్చునది
దోషములను తొల్గించునది
వైతరణిని దాటించునది
పరమపదముకు చేర్చునది
కాబేళాలకు త్రోయకుము
కాఠిన్యమింక చూపకుము
కామధేనువు పూజనీయము
కరుణతో బ్రతుకనీయుము
సాధుజంతువు మన గోవు
సాకుచుండుమోయి నీవు!
భూమాతకిదే వరదాయకము
గోమాతకు చేయి వందనము.//
