STORYMIRROR

Midhun babu

Classics Thriller Others

4  

Midhun babu

Classics Thriller Others

గమ్యస్థానం

గమ్యస్థానం

1 min
391


మది సంద్రం ఆశల, ఆశయాల కేంద్రం! 

పయనమెటో... గమ్యమెక్కడో తెలియకున్నా... 

పయనమెపుడూ తీరం వైపుగానే... 


తీరీతీరని కోరికలు 

చిరుచిరు ఆంక్షలకు తలఒగ్గుతూ

నట్టనడుమెక్కడో అంతర్ధానమవుతూంటే... 

మరిన్ని ఆకాంక్షలు ఉద్భవిస్తూనే...


గడియైనా విశ్రమించని కాల చక్రం 

ఆశయాల అడ్డుగోడలెన్నింటినో

సృష్టిస్తూ...పరిష్కరిస్తూ...తీరానికి చేరవేస్తూ... 


హృదిగదికి గడిబిగించ యత్నించే

మాటల సునామీలు ఎంతగా చెలరేగినా... 

సమస్యలు సుడిగుండాలై చుట్టుముట్టినా...

విజయభావుటానెగరేయాలనే మనసును

అడ్డుకొన తరమయ్యేనా... 


తుఫాను గాలికి పందిరి కూలినా...

మల్లెతీగ పరిమళాలను వెదజల్లుట మానుకొనునా...!


ప్రతి ఓటమొక కొత్త నీతిని ఉద్బోధిస్తుంటే... 

మరింత పంతాన్ని వృద్ధిచేస్తుంటే... 

అలలపై సాగే కలల తీగ పయనం 

తప్పక గమ్యస్థానం చేరితీరుతుంది!! 



Rate this content
Log in

Similar telugu poem from Classics