గగనం
గగనం
గమనం
మబ్బులు రమ్మనిపిలుస్తున్నాయి
కప్పలజాడ ఏమైందో
అక్కడక్కడ చుక్కలను తడుపు కున్న పక్షులు మాత్రం ఆశ గానే ఎదురు చూస్తున్నాయి
నోరు తెరచిన చెరువు ఇంకా ఆశగా ఉంది పోయిన బంధువులందరూ తిరిగి వస్తారని.
దాచి పెట్టుకున్న నీటిని తాగుతూ నింగికి ఆవిరిని పంపుతూనే ఉంది తరువు తన బాధ్యతగా
మేఘాల దాగిన నీటికై చూస్తూ రైతు చెమటనీటిని కక్కు తున్నాడు
పుస్తకం వెనకనుండి కాగితప్పడవలు వేచి చూస్తున్నాయి పిల్లాడిని షికారుతీసుకెళ్ళడానికి
నడికొప్పున ఇన్నాళ్లు వెలిగే సూర్యుళ్లని గబగబా కప్పెడుతున్నాడు మధ్యతరగతి అయ్య
రానా వద్దా అన్న తడబాటున ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతోంది నల్లమబ్బు.

