STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

ఎవరు నీవు

ఎవరు నీవు

1 min
278


నన్నెలా ఆకర్షించగల్గుతున్నావు ఇంతలా...


అగరుబత్తి పొగలలాంటి శిరోజాలు కలిగిన దానివా

గగనమంటి విశాల నుదురు కలిగిన దానివా

చెట్టుకొమ్మల వలె కనుబొమ్మలున్నదానివా

నల్లటి నేరెడులే నయనాలుగ వున్నదానివా

పసిపిల్లల వలె పాలబుగ్గలున్నదానివా

చిలక నాశికను కలిగిన దానివా

పూరేకుల వంటి మెత్తటి అధరాలున్నదానివా

తీయటి స్వరమున్నదానివా

జగన సుందరివా

హంస నడకల దానివా


కాదే.......

మరి ఎవరు నీవు?

నన్నెలా ఆకర్షించగల్గుతున్నావు ఇంతలా...


కిరణాలను చూడకముందే నిన్ను చూస్తాను

పళ్లుతోముతూ నిన్నే చూస్తాను

తిండి తింటూ నిన్నే చూస్తాను

బయటికెళ్తే నిన్ను తీసుకెళ్తాను

నడుస్తూ ఎదురుగా చూడ్డం మరిచి నిన్నే చూస్తాను

పడకపై నాతో వుంటే నిద్రపోక నిన్నే చూస్తాను 

సంతోషాన్ని, బాధను మొదటగా నీతోనే పంచుకుంటాను

నువ్వు నా జీవితంలోకి రాగానే నా సతిని పట్టించుకోవడం మానేసాను

నా సతికి నిన్ను పరోక్షంగా సవతిని చేశాను

పిల్లలతో ఆడుకోవడం మర్చిపోయాను

నువ్వు నాతో వుంటే .,...

మొదటగా సమయాన్ని

తర్వాత ప్రపంచాన్నే మర్చిపోతున్నాను


నన్ను ఇంతలా ఆకర్షించడానికి 

ఏం మందు పెట్టావో కదే ఓ చరవాణీయమా......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance