STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

ఎవరో ఒకరు

ఎవరో ఒకరు

1 min
309

ఎవరో ఒకరు,ఎవరైనా

సరే,ఎలాగైనా సరే

నామనసులోని బాధ బరువు

దించితే బావుండు

నాలో రగులుతున్న ఆవేదనను

ప్రేమ అనే చల్లని నీరు

చిలకరించి ఆర్పితే బావుండు


ముళ్ళు గుచ్చుకున్న

అరికాలును ఆప్యాయంగా

ఒళ్ళో పెట్టుకొని ఇంత ఉమ్ము

రాసి నొప్పి తెలియకుండ రవిక

పిన్నీసుతో సుతారంగా

ముల్లును లాగేసినట్టు ఎవరైనా

ఈ బాధను తీసేస్తే బావుండు


కుంకుడు పులుసు పడి

ఎర్రబారి మండుతున్న కళ్లల్లో

దయగల తల్లి తన చనుపాలు

పిండినట్టు ఎవరైనా

ఈ బాధ తీసేస్తే బావుండు


పక్షులు గూటికి చేరుకునే వేళ

సందే దీపం వెలిగించినట్టు

ఎవరైనా నామనసు గూటిలో

సంతోషం అనే దీపం వెలిగించి

నేనున్నానని

వెన్నుతట్టి చెపితే బావుండు


నరుడో హారుడో దానవుడో

పశువైన,చిన్నారి శిశువైన

నేనమ్మిన దైవాలో,నా చుట్టు

ఉన్నవారో,చివరికి ఏ చెట్టయిన

పుట్టయిన వాగైనా వంకైనా కొండైన కోనైన


ఈ సృష్టిలో ఎవరైనా ఏదైనా

ఎవరో ఒకరు ఎలాగైనా సరే 

నా మనసులోని బరువును

దించితే బావుండు

నా కన్నీటిను గులాబీ

రేకులాంటి కొన గోటితో తుడిచి

నీకు నేనున్నానని చెపితే

బావుండు


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance