ఎటు వైపు నీ పయనo
ఎటు వైపు నీ పయనo


జీవితం గమ్యం వైపు వెల్లవెళ్లనివ్వని నీ మనసు పయనం ఎటు
నీ కోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు కి సమాధానం ఎక్కడ
అడిగిన వాళ్ళను విష్మరించి విమర్శించే నీ వయసు దిస ఏది
గడిచిన క్షణం తీరని ఋణం అని తెలుసుకొని మనం
నిర్మించగలమా శ్రయషు కోరే సరికొత్త సమాజం
మేలుకో మిత్రమా !
నీ అభివృద్ధి ఒక కుటుంబం అంత విశాలం
నీ ఉన్నతి కి కొలమానం దేశ వైశాల్యం
పట్టు కోల్పోకు చెట్టు కు చేటు చెయ్యకు
గుర్తుపెట్టొకొ నీ దైర్యం ఒక విప్లవం
వెన్నంటే వున్నాం వెన్న మనస్కులం
రోజుని క్షణంలో కొలిచి
భయాని విడిచి
ప్రతి క్షణం ఆశయ సాధనకై మలిచి
దేశ రక్షణ పరమావధిగా నిలిచినా
ప్రతి సైనికుడి వీర గాధ నీకు స్ఫూర్తినివ్వాలి
నీలో మరో దేశ రక్షకుడు కొలువుతీరాలి
రైతుని బాధిస్తే
స్త్రీ ని నిందిస్తే
చంటి పాపా పాలకి కరువొస్తే
పలక పెట్టాల్సిన చేతులు పని మెట్లు కై వెతికితే
ఆ వ్యవస్థకు కొత్త అర్ధం ఇచ్చే
సమాజ శ్రేయషు కి ఐయుష్షు పొసి
అజ్ఞాన అంధకారం గుండెల్ని చీల్చి
నిజమైన భారతీయుడిగా వెలుగొందు
ఈ పయనం నీ ఆశయం అయితే
అనంత నిద్ర నుంచి లే ఆగని జ్వాలవై ప్రకాశించు
ప్రతి దినం ప్రతి క్షణం ఈ ఆశయనే శ్వాసించు
కోటి హృదయాల ప్రేమను ఆస్వాదించు.