STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏమని చెప్పను

ఏమని చెప్పను

1 min
3


చల్లని పున్నమి వెన్నెల వెండిధారలై కురిసే వేళా

చిగురాకులు వీవనై మేను తాకే చిరుగాలి అల్లరిలో


రేరాణుల సుగంధపు గమ్మత్తు మత్తులో

విరిసిన విరజాజుల అరనవ్వుల పలకరింతలో


నక్షత్రకాంతులల్లే మెరిసే నవమల్లికల విరిబోతలో

గాలి పెదవులు పాడే ఈలపాట రాగమధురిమలో


ప్రతిక్షణం నా తలపుల్లో మెసలే నీ పచ్చని జ్ఞాపకాలు

ఎద లో పదిలమై నిత్యం పలకరిస్తూనే ఉన్నాయని


మౌనాలన్ని మధురభావాలుగా మారి

మనసు పూదోటలో వలపు విరులై విరిసిపోతుంటే


కమ్మని కలల లోకం విరిసిన హరివిల్లై 

హృది ముంగిట వాలి రా రమ్మంటే


ఊహల ఊసులు ఊహించని కథలే వినిపిస్తే

 గుండె గొంతులో ఉక్కిరిబిక్కిరై ఊగిపోతుంటే


మనసు విహంగమై నిను చేరాలని ఆత్రపడి పోతోందని... "ఏమని చెప్పను" ఎన్నని చెప్పనూ

 నిను చేరలేని దూరాన నేనున్నా

నాలో నువ్వు ఉంటే నాతో ఉన్నట్టేగా

అయినా దేహాలకు దూరం ఎంతున్నా

మనమనసులకు దూరం దగ్గరేగా

నా ఏకాంతాలన్ని నీవు నిండిన కాంతులే కదా

నా ధ్యానం నీ ధ్యాసే కదా


Rate this content
Log in

Similar telugu poem from Romance