STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

దివ్య దీపావళి

దివ్య దీపావళి

1 min
383



కలల దీపాలు వెలిగించే

కోటి ఆశల దివ్వెల దీపావళి

దీపకాంతులతో ఆనందాల

వెలిసే రంగుల రంగేళియే

మన ఈ దీపావళి

కోట్లమంది జీవితాల్లో కాంతులై

విరుస్తూ కష్ట నష్టాల తీరం దాటి

వెలుగులు జిమ్మే కాంతి రావాలి

రంగు రంగుల రంగవల్లుల్లో

బంగారు కాంతులతో దీపాలు

దేదీప్యమవ్వాలి మహలక్ష్మికి

సుస్వాగతం పలుకుతూ


వెలుగులు విరజిమ్మే దీపావళి

పండు వెలుగుల నక్షత్ర తారావళి

చైతన్య దీప్తుల మిళిత శోభావళి

తెచ్చింది ఇంటింటా ఆనందాల

హేళి,రమ్యమైన తేజోమయి 

మధురమైన ఈ దీపావళి


మానస పూదోటలో

మమతల విరులు

అందరిలో అందమైన

మతాబుల్లా విరబూయాలి;

నవ్వుల పూవ్వుల్లా 

కాకరపువ్వొత్తులు

ఆనందాలు నింపాలి,

జీవితాలు రంగు హంగుల 

ఇంద్రధనుస్సులా చిచ్చుబుడ్డుల్లా 

తారాస్థాయికి చేరాలి


ఈ దివ్య దీపావళి వసుధలో

చెడుపై జయకేతనం

ఎగరవేయాలి;నిశిని ద్రోలి

శశికాంతులు పూయాలి!

ఇదేలే జీవన వెలుగుల రంగేళి!దివ్య దీపావళి శుభ

ాకాంక్షలు


కలల దీపాలు వెలిగించే

కోటి ఆశల దివ్వెల దీపావళి

దీపకాంతులతో ఆనందాల

వెలిసే రంగుల రంగేళియే

మన ఈ దీపావళి

కోట్లమంది జీవితాల్లో కాంతులై

విరుస్తూ కష్ట నష్టాల తీరం దాటి

వెలుగులు జిమ్మే కాంతి రావాలి

రంగు రంగుల రంగవల్లుల్లో

బంగారు కాంతులతో దీపాలు

దేదీప్యమవ్వాలి మహలక్ష్మికి

సుస్వాగతం పలుకుతూ


వెలుగులు విరజిమ్మే దీపావళి

పండు వెలుగుల నక్షత్ర తారావళి

చైతన్య దీప్తుల మిళిత శోభావళి

తెచ్చింది ఇంటింటా ఆనందాల

హేళి,రమ్యమైన తేజోమయి 

మధురమైన ఈ దీపావళి


మానస పూదోటలో

మమతల విరులు

అందరిలో అందమైన

మతాబుల్లా విరబూయాలి;

నవ్వుల పూవ్వుల్లా 

కాకరపువ్వొత్తులు

ఆనందాలు నింపాలి,

జీవితాలు రంగు హంగుల 

ఇంద్రధనుస్సులా చిచ్చుబుడ్డుల్లా 

తారాస్థాయికి చేరాలి


ఈ దివ్య దీపావళి వసుధలో

చెడుపై జయకేతనం

ఎగరవేయాలి;నిశిని ద్రోలి

శశికాంతులు పూయాలి!

ఇదేలే జీవన వెలుగుల రంగేళి!


Rate this content
Log in

Similar telugu poem from Classics