చక్కదనాల చిన్నది
చక్కదనాల చిన్నది
చక్కదనాల చిన్నది
చందమామనే ప్రేమిస్తున్నది
నీలిసంద్రపు అలలా
చెంగుచెంగున ఎగురుతు నాట్యమే చేస్తున్నది,
చల్లగాలి
వేణువై పలకరించగా తన్మయత్వపు అభినయంతో స్వాగతనృత్యం చేయుచున్నది,
పండువెన్నెల్లో పడుచుదనాన్ని కొసరికొసరి వడ్డిస్తానన్నది,
పూవంటి మనసును నెలరాజుకే అర్పించగా తహతహలాడుతున్నది, ప్రేమ ఆకలి తీర్చమంటూ పదేపదే వేడుతున్నది.
తళుకు తారా వెలుగే
తననవ్వులో చూడమన్నది,
కలతల కలల నిట్టూర్పులనిశి నాకేల అంటున్నది,
వయ్యారాల వలపువిందుకు జాగేలనని ప్రశ్నిస్తున్నది,
ఓటమెరుగని ప్రేమాభక్తి నీవులేక బ్రతకలేనంటున్నది,
చిగురించిన ఆశలతో చెలికాడే చెంతచేరగా జన్మధన్యమైనదని మురిసిపోతున్నది.

