చిట్టి గుండె
చిట్టి గుండె
గోర్వెచ్చని కోటినదుల..సంద్రముకద చిట్టిగుండె..!
హృదయగగన వీధులకే..ద్వారముకద చిట్టిగుండె..!
ప్రేమవనము రాచిలుకల..కలకలమే తీరేనా..
ఊరడించు రాగసిరుల..నగరముకద చిట్టిగుండె..!
ప్రణవనాద శిఖరాలను..చుంబించగ కుదిరేనా..
అంతరంగ లోకాలకు..అద్దముకద చిట్టిగుండె..!
ఎఱుకగాక అసలు మధువు..ఉందా ఈ విశ్వమందు..
సత్యమేదొ చాటేందుకు..సాయముకద చిట్టిగుండె..!
సాక్షియైన కాలానికి..లెక్కలెంత చిత్రమోయి..
మనసుగుట్టు అందజేయు..స్వర్గము కద చిట్టిగుండె..!

