చిరునవ్వు...
చిరునవ్వు...
ఒక చిరునవ్వు చాలు
వంద దుఃఖాలు మటుమాయం
అవమానాలు తుడిచేసి
ముగ్ధ మోహక భ్రమరంలా
రంగు రంగుల రెక్కలిచ్చి
బెలూనుల సమూహంలా
ఆకాశంలోకి ఎగరవేసే
ఒక చిరునవ్వు చాలు
పుష్ప వ్రుష్టి కురుస్తుందా
నక్షత్ర గానం వినిపిస్తుందా
మోడైన అడవులు చిగురించేనా
చితులన్నీ లేచి నిల్చేనా అగ్ని ఆరేనా
మరణాన్ని జయించేందుకు
మూర్ఖత్వాన్ని ఎదిరించేందుకు
ముష్టి మేయుల్ని తిరస్కరించేందుకు
ఓ చిరునవ్వు చాలు
అవకాశాలు మ్రుగ్యమైనా మరికొన్నాళ్ళు
మరో ప్రయత్న బాణం సంధించేందుకు
మరో సఫల యాత్ర ప్రారంభానికి
తిట్లనుండి తిరస్కరణకి
అపజయాలనుండి అమేయత్వానికి
అంగారకత్వం నుంచి మహాగ్ని జ్వలనకు
ఒకటి చాలు
ముద్దు చేయి
ముద్దు పెట్టు
అశరీరుడు శరీరుడౌతాడు
అవివేకి ఆయుధం ఔతాడు...
... సిరి ✍️❤️

