STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బ్రతుకు పోరాటము

బ్రతుకు పోరాటము

1 min
332


పిడికెడు బువ్వ లేక

కట్ట సరైన బట్ట లేక

తల్లడిల్లే కడుపున్న దేహం నాది


నేల రాలిన మేతుకులే పరమాన్నంగా

వీధి కొలాయిలో నీళ్ళు అమృతంగా

ఫుట్ పాత్ లే మంచంగా భావించే బ్రతుకు నాది


అమ్మకి దూరమై అనాధనైతిని

వీధుల్లో తిరుగుతూ సమాజంలో హీనమైతిని

సమాజం వెలివేయబడి అందరిలో ఉంటూ ఒంటరినైతిని


బక్క చిక్కిన ప్రాణం నాది

అలుపెరుగని పోరాటం నాది

ఆస్తుల కోసమో అంతస్థుల కోసమో కాదు బుక్కెడు భువ్వ కోసం మాత్రమే


మనసున మలినం లేదు

మలినమైన దుస్తులు తప్ప

మాసిపోయిన దేహం తప్ప


సత్తువ లేదు సాధించెంత శక్తి లేదు

సావు బ్రతుకుల మధ్య పోరాటం తప్ప

సచ్చెంత వరకు ఆరాటం తప్ప.....!!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational