STORYMIRROR

Midhun babu

Classics Fantasy Thriller

4  

Midhun babu

Classics Fantasy Thriller

బ్రతుకు చాలు

బ్రతుకు చాలు

1 min
6


భ్రమావరణ గంధానికి..బానిసలా బ్రతుకుచాలు..! 

రాలుపూల హాసానికి..ఊయలలా బ్రతుకుచాలు..! 


ఆగక కురిసే నిప్పుల..పాఠమెంత మనోహరం.. 

ఈ వసంత గ్రీష్మానికి..కోవెలలా బ్రతుకుచాలు..! 


అల్లుకున్న వినోదాల..హరివిల్లుల సందడిదే.. 

వసంతాల వేదానికి..కోకిలలా బ్రతుకుచాలు..! 


మంత్రించే చూపులతో..వెంట తిప్పుకున్నావుగ.. 

తిరుగులేని విరహానికి..గీతికలా బ్రతుకుచాలు..! 


మతిమరుపు హితవరియని..తెలిసి మరువలేనేమిటి.. 

నవ్వుతున్న మోహానికి..నవలికలా బ్రతుకుచాలు..! 


పడిపోయిన పీటముడిని..గమనించుట హాయేలే.. 

వ్రాసుకున్న కథనానికి..వాహికలా బ్రతుకుచాలు..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics