బంగారపు బొమ్మ
బంగారపు బొమ్మ
బంగారపు కొమ్ములేవొ..మొలవకుండ చూసుకొమ్ము..!
చిరునవ్వుల పూలచెట్టు..వాడకుండ నిలుపుకొమ్ము..!
ఆవేశపు పాలెందుకు..కోపాలకు చోటెందుకు..
చక్కని నీ రూపాలే..చెలిమిపాలు కాచుకొమ్ము..!
మాటలెన్ని అనర్థాలు..తెచ్చేనో మధురముగా..
మౌనపుతోటన విరిసిన..సుమరాశులు పంచుకొమ్ము..!
ప్రేమమంత్ర మహిమెంతో..అక్షరాలు చెప్పగలవు..
విశ్వవ్యాప్త చైతన్యపు..గీతమదే వ్రాసుకొమ్ము..!
ప్రతి అడుగుకు గొడుగంటే..నీ చక్కని గ్రహింపందు..
పడేపడే వెలుగువాన..తీర్థమునే అందుకొమ్ము..!
వ్యతిరేకత గాక సొంత..నరకమేదొ లేదంటా..
స్వర్గమసలు వేరెచటో..లేదన్నది తెలుసుకొమ్ము..!
