బంధం విలువ
బంధం విలువ
నిన్ను తలుచుకోవడం కోసమే
నేను ...
ఒంటరిగా ఉన్నప్పుడు
తెలుస్తుంది
తలపు విలువ...!!
దగ్గర్లగా నువ్వు లేకున్నా
నా మౌనం కూడా
నీతో సంభాషించినప్పుడు
తెలుస్తుంది
పలుకు విలువ...!!
నాకు దూరంగా
నువ్వు ఉన్నావనే
అలజడి మదిలో
రేగినప్పుడు
తెలుస్తుంది
మమత విలువ...!!
కలతో మొదలై కవితల వరకు
భావాల పరంపర
నీతో
విన్నవించుకున్నప్పుడు
తెలుస్తుంది
కాంక్ష విలువ..!!
నీవు అన్నదే నా మనస్సుకు
అతి మధురమై
ఆ ఆనందపు తడి
హృదయాన్ని
తాకినప్పుడు తెలుస్తుంది
"బంధం విలువ"....!!