అనుబంధం...
అనుబంధం...
నా సంతోషానికి నువ్వు అక్షరమై
రంగులద్దుతావు
నాలో ఆవేదనకు అశృవులు రాలితే
అక్షర బిందువులుగా మార్చి ఊరడిస్తావు
మనసు నొచ్చుకొని మౌనం వహిస్తే
మదిలో భావనకు ప్రాణం పోస్తావు
నా జీవితంలో ప్రతి సంఘటన
నీకన్నా తెలుసుకోలేరు ఎవరున్నా
భావోద్వేగాలను భావవ్యక్తీకరించేది నువ్వే.
నా ఊహలకు ప్రాణం నువ్వే
నా ఉనికి నువ్వే
నీతో నా స్నేహానుబంధం
జన్మజన్మల అనుబంధం.............!!
... సిరి ✍️❤️

