అజంతా శిల్పమా...
అజంతా శిల్పమా...
నడకా అది హంసద్వని రాగమా
నడుమా అది గగనం లో కుసుమమా
సోగసా అది ఇంద్రలోకం లో
విరిసిన పారిజాతపుష్పమా
హిమగిిరుల వయ్యరమా
పురి విప్పిన మయూరమా
అనంత ప్రేమ సముద్రపు వాహినిలో
అలలా చెల రేగిన ప్రణయ ప్రవాహమా
కమ్మనైన యవ్వనపు సరస్సులో
కమలం లా వికసించిన సుకుమారమా
కెంపులైన చెక్కిలి ఊరిoతలలో
కులుకుకొలుకు అజంతా శిల్పమా..
సూర్యోదయపూ కిరణాల తేజస్సుతో
చంద్రోదయ చల్లని తమస్సు తో
విరబూసిన పరిమళాల సువాసనల
మేళవించిన అపురూప ఎల్లోరా చిత్రమా...
నా మనస్సును నిలువునా దోచిన
అరుదైన బ్రహ్మ పుష్పమా...
... సిరి ✍️❤️

