అహం అహం
అహం అహం
ఏది నీది
ఏది నాది
నీది నాదను హక్కు ఏది
మిన్ను నీదా
మన్ను నీదా
మిన్ను మన్నుల సృష్టి నీదా
హలం తొక్కిన పొలం నీదా
కదం మోపిన స్థలం నీదా
చెట్టు నీదా
పుట్ట నీదా
నీది నీదను జన్మ నీదా
విశ్వమంతా విష్ణువైతే
నేను నేనను అహం ఏమి
నెత్తురంతా ఎరుపు అయితే
నలుపు తెలుపను భేదమేమి
మనుషులంతా ఒక్కటయితే
కులముతో కొలమానమేమి
ధనముపై నీ మోహమేమి
తీరనీ ఈ దాహమేమి
ఉన్నదేమి లేనిదేమి
ఉన్నదానిలో లేనిదేమి
కలిమి లేములు విడిచిపెట్టి
నీ శ్రమపై మనసు పెట్టి
ధర్మ మార్గం ఒడిసి పట్టి
సాగవోయ్ నువు సాగవోయ్
బ్రతకవోయ్ బ్రతికించవోయ్
జై హింద్
