STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

నేను సాక్షనవ్వాలి

నేను సాక్షనవ్వాలి

1 min
285

అభినందన వెల్లువలకు 'నేను' సాక్షినవ్వాలి..!!

పలు రకాల విమర్శలకు 'నేను' సాక్షినవ్వాలి..!!


ఎరుకతోటి ప్రతి పనిని గమనిస్తూ చేసేస్తూ..!!

క్షణాల విరి ఊయలలకు 'నేను' సాక్షినవ్వాలి..!! 


చూపు వాన పడుతుంటే మెరుపులెలా విరిసేనో..!!

కను పాపల దీపాలకు 'నేను' సాక్షినవ్వాలి..!!


గులాబీలు నవ్వవెపుడు..ప్రేమ ఎదల కదిలించును..!!

ముళ్ళ మాటు రాగాలకు 'నేను' సాక్షినవ్వాలి..!!


మంత్రించే చెలి నవ్వులు హృదయమేలు సెలయేరులు..!!

కత్తి దూయు విరహాలకు 'నేను' సాక్షినవ్వాలి..!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational