STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

పటపగలు

పటపగలు

1 min
9


"అమావాస్య"లాగ ఎలా..మారిందో పట్టపగలు..! 

రామచిలుక 'మనసు' ఎలా..చెదిరిందో పట్టపగలు..! 


పరిమళించలేని తనం..చుట్టేసెను గాలులనే.. 

ఈ-చదువుల తీరు ఎలా..ఆగిందో పట్టపగలు..! 


ప్రేమకథా సాగరమే..కల్లోలము పాలయ్యెనె.. 

చిత్రమైన వలపు ఎలా..మరిగిందో పట్టపగలు..! 


చెలిమికింత వెలకట్టే..గుణమదెంత వెర్రితనం.. 

భంగపడిన డాలరెలా..కుంగిందో పట్టపగలు..!


మాస్కులేక బ్రతుకలేని..కాలమెంత విచిత్రమో.. 

చేసుకున్న పాపమెలా..పండిందో పట్టపగలు..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics