ఆవిరైన ఆశల
ఆవిరైన ఆశల
ఆవిరైన ఆశల సౌధం
ఎన్ని కలలు కన్నాను
ఎన్ని ఆశలు శ్వాసలై స్వాశిoచాయి
ఎన్ని కోర్కెలు పచ్చని మొకలల్లే మోసులేసాయో
ఎన్ని ఆలోచనలు ఆకుపచ్చని తీగలల్లే అల్లుకున్నాయో
ఎన్ని వెన్నెల రాత్రులన్నీ నాకోసం వెలుగులదీపాలై వెలిగాయో
ఎన్ని నక్షత్రాలు నాకై నవ్వుల పువ్వులై వెలిగాయో
ఎన్ని సంతోషాలు నిండు పున్నమి చంద్రోదయాల వెలుగురేఖ లయ్యాయో
ప్చ్.. అన్ని ఒకనాటి పరుగెత్తే పసిడిమనసు
పరవళ్లు..
ఇది వసివాడని ,మనసు మాయని పసిడి కథ
కానీ కాలమంతా కమ్మనినిదురలోని కల కాదుకదా
కాలనుగత మార్పుల ప్రవాహ జీవనప్రవాహంలో ఆటు, పోటు ఎగుడు దిగుడుల అలజడుల తుఫాను బీభత్సపెనుతుఫాను లెన్నో
ఆశలు ఆవిరై ,కలలు కల్లలై
ఎడారి దారుల వేదనల స్వరమై
హృదయపు మమతలు పేకమేడలై
అవిరైన ఆశల సౌధమై
వెలిగిన దారులన్నీ అమాస చీకటి తెరలై
నెలరాలిన చిక్కని చుక్కలై
నేడు
గుప్పిట చిక్కని తైలమై
మనసు మాయమై పోతుంటే
గతమంతా నేడు ఎండిన
పెదవులపై మెరిసి వెలిసిన చిరునవ్వే..

