ఆరోగ్యమే మహా భాగ్యం
ఆరోగ్యమే మహా భాగ్యం
బాలపంచపదులు
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆయుష్షు పెంచునిదె నాయుర్వేదము
ప్రాచీనమైనదీ వేదసంహితము
ప్రజారోగ్యమే జాతికి వైభవము
ఆచరించుట ఆవశ్యకము జయ.
మంచి భోజనం నియమితాహారము
క్రమశిక్షణాయుతమౌ జీవనము
సాధువర్తనతో నాత్మ నిగ్రహము
మనిషికి ముఖ్యం మనో వికాసము
కావలయును గుణశీలము జయ.
ప్రతిదినమూ సల్పుచు వ్యాయామము
సమయ పాలనతో జీవించటము
బలతేజస్సులతో ప్రవర్థనము
రోగనాశనమే శక్తి సంయుతము
తెలిసికొన్నచో నానందము జయ.
ఉషోదయాన గాంచ సూర్య బింబము
నరనరాల్లో నిండు నూత్న తేజము
చంద్రోదయాన విశ్రాంతియే ముఖ్యము
చిత్త శాంతిని కల్గించు శయనము
దేహపరిరక్షణ చేయును జయ.
నియమనిష్ఠలతోడ జీవనము
సద్గుణములతోడ మెలగటము
ధర్మగతిలోన పయనించటము
కామక్రోధములను త్యజించటము
సజ్జన సాంగత్యము పెన్నిధి జయ.
మానసిక శారీరిక నారోగ్యము
పెంచెడి పుస్తకముల పఠనము
పాటించగ కలుగులే నాహ్లాదము
మరిచిపోరాదీ జీవన సూత్రము
మహిమాన్విత మైన పాఠము జయ.
**************************
