STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆంక్షల సంకెళ్ళు

ఆంక్షల సంకెళ్ళు

1 min
5


నా ప్రేమ గాయపడ్డ గాయం

 గాయపరచి తెంచుకోవడమే తెలిసిన

క్రూరత్వపు కుంచితపు హృదయం నీది

ప్రేమించడం గాయపడ్డం 

రెండూ తెలిసిన అనుభవం నాది

గాయపడ్డాను కదానీ ప్రేమించడం

మానలేని మనసు నాది


 కొన్ని చిరునవ్వుల ముత్యాలను

కొన్ని అనురాగపు రత్నాలను

మరికొన్ని మమతల మధురిమలను

మురిపెంగామూటగట్టుకొని నా జన్మాంతo వరకు

మధురానుభూతులుగా మలచుకుని 

దాచుకుందామనేగా దోసిలొగ్గి

నిన్ను ఆర్తిగా అడిగింది


నువ్వేనేనని నేనే నువ్వని నమ్మి

నన్ను నేను కోల్పోయి నీలో ఏకమైనక్షణాలను

నన్నునేను శూన్యం గా మిగుల్చుకున్నఏకాంతాలను

ఒక కర్కశ కసాయికి ధారబోశానని

నీ ఆంక్షల సంకెళ్ళ కు చిక్కి

బంగారు పంజరంలో పసిడి చిలుకనైపోయి

నేనంటూ మిగలని పరాన్నజీవి నైపోయానని

తెలుసుకునేలోపే జీవితం వెలిసిపోయిన చిత్రంలామారింది 

ప్రతిక్షణo అవి గుర్తొచ్చినప్పుడల్లా

చేదుజ్ఞాపకాలుగా మాత్రమే నాకు మిగిలాయి 

 అవి పచ్చిగా నాయెదలో గుది గుచ్చుకొని

గుండు సూదులై పొడుస్తూ నే ఉన్నాయి

కాలం కాకలు తీరిన యోధ

ఇప్పటి క్షణం ఇలా నీ పక్షం కావచ్చు 

మరో క్షణం గాయానికిమందుగామారి మాన్పపొచ్చు

నా పయనం మున్ముందుకే 



Rate this content
Log in

Similar telugu poem from Romance