వారి కలలు మన స్వేచ్ఛ
వారి కలలు మన స్వేచ్ఛ
కందము
హద్దుల వెంబడి నిలబడి
పొద్దులెఱుంగని జవాను మోమున నగవుల్
వద్దనలేనట్టి విధముఁ
నిద్దామండీ మనమిక నిలపై సతమున్
శిశిర వసంతములన్నియు
శశి రవి గానక బ్రతుకున ౙరుగును గద యీ
నిశి రాతిరి గాచు గణముఁ
వశమే పాపము నసువుల బడుటయుఁ మనకై
