STORYMIRROR

Naveen Surya

Inspirational

4  

Naveen Surya

Inspirational

విజేత

విజేత

3 mins
317

 అది ఢిల్లీ లోని ప్రముఖ స్టేడియం , రాత్రి 8 గంటల సమయం , కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్సలేన్స్ అవార్డ్స్ - 2021 అది


వేడుకకి ప్రముఖ దిగ్గజాలు మరియు యువ వ్యాపార వేత్తలు , పారిశ్రామిక వేత్తలు వ్యాపార , పారిశ్రామిక రంగాల్లోని ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు


 ఇక్కడకి వచ్చిన ఒక్కొక్కరిది ఒక్కో కథ , మరియు ఎన్నో ఓటములు , ఒడిదుడుకులు లను ఎదుర్కొని ఇప్పుడు పురస్కారం అందుకోబోతున్న వ్యక్తి అతను . ఆయన పేరు నంద కిషోర్ NK Global Solutions సంస్థ అధినేత అయన గురించి తెలుసుకోవాలి అంటే కనీసం ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి 


------------------------

3 సంవత్సరాల క్రితం 

------------------------ 


నీ స్నేహితులు చాలా మంది వెళ్ళారు , మన బంధువులలో కూడా చాలా మంది US , UK , AUS వెళ్ళారు , నువ్వు కూడా వెళ్లొచ్చు కదా, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది నీ జీవితం బాగుంటుంది 


నాన్న నీకు చాలా సార్లు చెప్పాను , నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని నేను ఇక్కడే ఒక సంస్థ నీ స్థాపించి వ్యాపారం చేయడం నా కల అని


బీ.టెక్ పూర్తి చేసి 2 సంవత్సరాలు పూర్తి అయింది . నీతో చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉన్నారు . పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం స్టార్టప్ , కంపెనీ , వ్యాపారం పేరుతో సమయం వృధా చేస్తున్నావ్ 


ఇంకొక 6 నెలలు సమయం ఇవ్వండి . కచ్చితంగా కంపెనీ మొదలుపెట్టి నేను అనుకున్నది చేస్తాను . కేవలం 6 నెలలు ఆ తర్వాత అంతా మీ ఇష్టం మీరు చెప్పినట్లే జరుగుతుంది . మీరు ఎం చేయమంటే అది చేస్తాను 


లేదు నువ్వేళ్ళి తీరాల్సిందే . ఎంబీఏ చేయాల్సిందే కాదు కుదరదు అంటే లేదంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చింది చేసుకో


--------------------------------------------------

ఒక వారం తరువాత - విసా ఇంటర్వూ

--------------------------------------------------


Mr.నంద కిషోర్ గారు ఒక వారం లో మీకు పోస్ట్ మరియు మెయిల్ వస్తుంది


-------------------------

ఇంకో వారం తరువాత

------------------------


ఒరేయ్ నందు ఇదిగో స్వీట్ తీసుకో 


సెలక్ట్ అయ్యానా


నాకు తెలుసు రా నీకు కచ్చితంగా విసా వస్తుంది అని . నువ్వు నా కొడుకు వి . అక్కడకి వెళ్తే నీ జీవితం బాగుంటుంది రా 


నాకిష్టం లేని జీవితం ఎంత బాగుంటే ఎంటి . నచ్చనప్పుడు ఎంత ఖరీదైన కార్ కొన్నా నచ్చదు ( మనసులో మాట ) 


మీ ఇష్టం నాన్న 


---------------------------

ఒక వారం తరువాత 

-------------------------- 

హలో ! సత్యనారాయణ గారు నేను సుబ్రమణ్యం మాట్లాడుతున్న


హా ! చెప్పండి ఏమిటి విశేషం ! ఇంత పొద్దునే కాల్ చేశారు 


మరేమీ లేదండి అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు . ఈ సందర్భంగా అందరికీ ఒక చిన్న పార్టీ ఇస్తున్నాము . మీరు ఆవిడ రేపు సాయంత్రం తప్పకుండా రావాలి అండి 


 సంతోషం ! మొత్తానికి మీ అబ్బాయి దారిలోకి వచ్చాడు అన్నమాట 

సరే అయితే తప్పకుండా వస్తాను 



మర్చిపోకండి , రేపు సాయంత్రం 6 గంటలకి 


అలాగే అండి , ఉంటాను 


ఉంటాను సత్యనారాయణ గారు


--------------------------

పార్టీ రోజు 

--------------------------


ఆశ్విత్ :: ఇంకేంట్రా మొత్తానికి ఆస్ట్రేలియా వెళ్తున్నావ్ అయితే .


నందు ::: నేను ఎక్కడ వెళ్తున్నాను బలవంతంగా పంపిస్తుంటే . సొంత కాళ్ళ మీద నిలబడమని చెప్తారు కానీ , సొంత ఆశయాలను సాధించండి , వాటి కోసం కస్టపడండి అని చెప్పరు ఏంట్రా వీళ్లంతా 

ఎవడో ఏదో చేస్తే దాన్నే మనల్ని చేయమంటున్నారు చుడు 

అయినా ఇందులో నా జీవితం , నా గెలుపు ఎక్కడ ఉంది రా . నా జీవితం ఎంటో , నేను చేయాలి అనుకున్నది ఎంటో నాకు నిర్ణయించుకునే హక్కు ఉండదా


మానస :: కూల్ రా ఎంబీఏ చేసి వచ్చేయ్ . ఆ తర్వాత నాన్న నేను ఇక్కడే వ్యాపారం చేస్తానని చెప్పు . అప్పుడు వద్దనే అవకాశం లేదు 


న ...నందు 


ఆశ్విత్ :: వాడికసలు ఇష్టం లేదు అంటుంటే నువ్వేంటి ఏదేదో చెప్తావు


---------------------

నందు పార్టీ నుండి వెళ్ళిపోతున్నాడు

--------------------



ATTENTION PLEASE ఇవ్వాళ నాకు చాలా సంతోషంగా ఉంది . చెప్పలేనంత సంతోషంగా ఉంది . నందు పైకి రారా 


నా కొడుకు విదేశాలకు వెళ్తున్నాడు అనే సంతోషం తో పార్టీ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారా ! లేదు . నిజానికి వాడికి వెళ్ళడం ఇష్టం లేదు నేనే బలవంతంగా తనను పంపిస్తున్నాను 


అందరినీ నా కొడుకు విదేశాలకు వెళ్తున్నాడు అని చెప్పిఆహ్వానించాను కానీ ఈరోజు పార్టీ ఇవ్వడం వెనుక ఇక కారణం మరియు ఒక విశేషం ఉంది 


----- సశేషం -----







Rate this content
Log in

Similar telugu story from Inspirational