శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

తప్పెవరిది

తప్పెవరిది

2 mins
349


           తప్పెవరిది?

      -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

      

   నేను చెసే బ్యాంక్ లోనే అధికారిగా వచ్చాడు శేఖర్.

   వాడిని చూడగానే ఆశ్చర్యపోయాను. అలాంటి పదవిలో వాడుండటం నిజంగా గ్రేట్.

   

   అరె...నువ్వాట్ర్రా శేఖర్...? చాలా రోజులకు చూసానేమో ...కలిసి చదువుకోవడం వల్ల వాడిని చనువుగా పలకరించాను.


   వాడు కూడా నన్ను చూసి ఇట్టే పోల్చేశాడు. "నువ్వు రాజేష్ వి కదూ" అన్నాడు అనుమానం లేదన్నట్టు. 

   

  నిజమే మరి...ఎలా మర్చిపోగలం...? చదువుకునే రోజుల్లో...ఎవరైతే చదవని వాడూ... చదివే వాడూ ఉంటారో.. వారెప్పటికీ గుర్తుండిపోతారు అందరికీ.


   అలాంటివారే...మేమిద్దరం.


   వాడు బాగా చదివేవాడు కాదు. నేనేమో అందరిలోనూ బాగా చదివేవాడిని. 


   వాడినైతే...టీచర్లందరూ గొడ్డుని బాదినట్టు బాధేవారు. సరిగా చదవడం లేదని. నన్నెంతో పొగిడేవారు. 


   పదో తరగతి ఫలితాలు వచ్చాయి...


   వాడికి నాకంటే ఎక్కువ మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. అప్పుడే మేమంతా ఆశ్చర్యపోయాం. వాడు మాత్రం కాలరెగరేస్తూ ఫోజిచ్చాడు. 


   పాత రోజులలా కళ్ళముందు మెదిలేసరికి ...నాలో ఏదో జెలసీ వచ్చినట్టయ్యింది. 

   

   వాడున్న పొజిషన్ చూస్తే ...వాడి గురించి తెలుసున్న ప్రతివాళ్ళకీ అలాగే అనిపిస్తుంది. పైగా వాడు చదివింది ఇంటర్ వరకే. నేను చదివింది డిగ్రీ వరకూ.


   ఈ బ్యాంక్ కి అధికారిగా వాడు రావడంతో... వాడి కింద సబార్డినేటర్ గా ఓ క్లర్క్ పోస్టులో నేనుండటం చాలా నామోషీగా అనిపించింది.


   వాడు తనెదురుగా కూర్చోమని ఎన్నో విషయాలు ముచ్చటించాడు. తన కుటుంబ విషయాలు చెప్పి...

నాగురించి కూడా తెలుసుకున్నాడు. 


   "సరే...సాయంత్రం కలుసుకుందాం" అంటూ డ్యూటీలో మునిగిపోయాడు. నేనూ నా కౌంటర్కెళ్లిపోయాను. 


    సాయంత్రం మాఇంటికొచ్చాడు...స్వీట్ బాక్స్ పట్టుకుని. నేనూ నాభార్యా సాదరంగా ఆహ్వానించాం. నా భార్యను పరిచయం చేసాకా...టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది.


   మా మధ్యతరగతి ఇంటిని పరిశీలిస్తూ నా వైపు చూసాడు... "నువ్వెంతో పెద్ద ఉద్యోగం చేస్తూ వుంటావనుకున్నాను. చాలా బాధగా ఉంది...నువ్వలా చిన్న కేడర్ లోనే ఉండిపోవడం" అన్నాడు సానుభూతి చూపిస్తూ.


   ఈరోజుల్లో ఎంత బాగా చదివినా ఉత్తరం గానీ...దక్షిణ గానీ ఇవ్వగలిగే అర్హత మనకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఆరెండూ నాకు లేవు. చదివిన డిగ్రీలున్నా ఎందుకూ కొరగాకుండా పోయాయి" నేను మామూలుగా చెప్పినా నామాటల్లో వేదాంత ధోరణే కనిపించినట్టుంది వాడికి.


  వాడు చిన్నగా నాభుజం తట్టాడు.


  "నీకో విషయం చెబుదామని వచ్చాను. మనిద్దరం ఒకే బళ్ళో చదువుకుని...ఒకే చోట ఉద్యోగాలు చేయడం ఆనందంగా వున్నా....నీలాంటి మేధావి నాకంటే చిన్న ఉద్యోగం చెయ్యడం నాకూ నామోషీగానే ఉంది.

మనిద్దరం స్నేహితులమని బ్యాంక్ లో నువ్వు చెప్పినా పర్లేదు. కానీ పదో తరగతి పరీక్షలు నీదాంట్లో కాపీ కొట్టి పాసయ్యినట్టు ఎవరితోనూ అనకు" అంటూ చెప్పి నాభార్య ఇచ్చిన టీ తాగేసి కార్లో వెళ్ళిపోయాడు శేఖర్.


  వాడు వెళ్లిన వైపే చూస్తూ ఆలోచిస్తున్నాను...

   

  నిజమే...ఈతప్పు ఎవరిది...? మన విద్యా విధానందా...? లేక దొడ్డి దారిలో రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఉద్యోగాన్ని కొట్టేసిన వీడిదా...?


   అలా ఆలోచిస్తూనే వున్నాను చాలాసేపు....!!*


           ***    ***    ****


    



Rate this content
Log in

Similar telugu story from Inspirational