శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

తిరిగొచ్చిన వసంతం

తిరిగొచ్చిన వసంతం

2 mins
436



           తిరిగొచ్చిన వసంతం

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    అలా పరిచయమైన వ్యక్తి...తన జీవిత భాగస్వామి అవుతాడని కలలో కూడా ఊహించలేదు లలిత. పెళ్లి కాకుండా ఉండిపోయిన తన మెడలో మూడుముళ్లు వేసి..తనలో ఉన్న అహంకారాన్ని తోడేస్తాడని కూడా అనుకోలేదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భర్త మనసు ఎంత స్వచ్ఛమైనదో తెలిసాక గతంలో తాను చేసిన పనికి చాలా తప్పుచేశాననిపిస్తూ ఉంటుంది లలితకు.    

    

   వీరి పెళ్లి వెనుక కథ చెప్పాలంటే జరిగిపోయిన రెండు సంఘటనలు చెప్పుకోవాలి మరి.

    

   రైతుబజార్లో...కూరలు ఎంచుకుంటున్న లలిత "హలో మేడం" అని పిలిచిన ఆ అపరిచిత వ్యక్తిని చూసి...చిన్నగా తడబడింది.

      

   "నేనెవరో మీకు తెలియకపోయినా ...మీరెవరో నాకు తెలుసు.మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు " చెప్పాడు సుధాకర్.

      

     "ఇంతకీ మీరెవరు? నాకు గుర్తురావడం లేదు"

     "అవునులెండి.ముఖాముఖి మీరెప్పుడూ నన్ను చూడలేదు.మీ నాన్నగారి స్నేహితుడైన మా నాన్న గారు  మనకు పెళ్లి చేయదలిచి ....మీ ఫోటో తెచ్చి చూపించారు. మీ అందచందాలు తెగ నచ్చేసి...మీకు తెలియకుండానే మీ వెంటపడి పిచ్చిగా ప్రేమించాను.కానీ...తర్వాత తెలిసింది నేను నల్లగా ఉంటానని తెలిసి...కనీసం నా ఫోటో అయినా చూడకుండా మీరు నన్ను తిరస్కరించారని. ఇది జరిగి అయిదేళ్ళు గడిచిపోయింది కదా...మీరు మరిచిపోయుంటారు. నాపేరు సుధాకర్ అంటారు" అంటూ నవ్వుతూ చెప్పి అక్కడ నుంచి నిష్క్రమించాడు.

      

     అతని మాటలతో గతం గుర్తుకొచ్చి... ఆనాడు నేను తిరస్కరించింది ఇతన్నేనా? నల్లగా వున్నా ఎంత కళగా వున్నాడు..! ఎంతో తెల్లగా అందంగా వుండే ప్రదీప్ నామనసులో ఉండటం వల్ల...ఇంట్లో వాళ్ళు ఏ పెళ్ళికొడుకు ఫొటోస్ చూపించినా ఏదో ఒక వంకతో...తోసిపుచ్చేదాన్ని. కానీ చివరికేమైంది....? ప్రదీప్ నన్ను కాదని గొప్పింటి సంబంధం చేసుకున్నాడు. ఆనాడే ఆ ప్రేమ జోలికి పోకుండా...నాన్న ఈ సంబంధం చేసుకోమని ఎంతగానో బ్రతిమలాడినప్పుడైనా ఇతన్ని చేసుకుని ఉంటే....నా జీవితం చేజారిపోకుండా వుండేది కదా అని అనుకోకుండా వుండలేకపోయింది లలిత. 

      

     కానీ లలితకు తెలీదు....ఇంకా పెళ్లి కాకుండా ఉండిపోయిన సుధాకర్ ...చేజారిన తన జీవితానికి చేయూత నివ్వడానికైనా రెడీగా వున్నాడని.


     ఈసారి తండ్రి చేతికిచ్చిన ఫోటోను అందుకుంది. అందులో అతన్ని చూసి...అది కలో నిజమో తెలియక, ఆశ్చర్యంపోయినా, తన సమ్మతాన్ని తండ్రికి వెంటనే చెప్పేసింది.


     మంగలవాయిద్యాలు మ్రోగడానికి ఎన్నోరోజులు పట్టలేదు. 


    సుధాకర్, లలితలు దంపతులై చిలకా గోరింకల్లా కొత్త కాపురం పెట్టుకున్నారు.


   భర్త సహృదయతకు చలించిపోతూ కంటతడి పెట్టుకుంది లలిత.


   భార్యని దగ్గరకు తీసుకొని కళ్ళు తుడిచాడు. 

   

  "ఏమండీ...నేను మీకెంతో రుణపడి ఉన్నాను. ఆనాడు మిమ్మల్ని కాదన్నా...ఇప్పటి వరకూ పెళ్లిచేసుకోకుండా నాకొసమే వేచివున్నారని తెలిసాక నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను." అంటూ బాధపడింది. 


   చ...అలా నువ్వెప్పుడూ అనుకోకు. మనిద్దరికీ పెళ్లయ్యే రాత ఇప్పుడే వచ్చింది కాబట్టి...ఆనాడు తప్పిపోయింది. తెలిసో తెలియకో ప్రేమలో మోసపోవడం సహజం. పెళ్ళిచేసుకుంటే నిన్నే చేసుకోవాలన్న నా బలమైన సంకల్పమేనేమో ...మనిద్దర్నీ ఈనాటికిలా ఏకం చేసింది. ఎలాగైతే మనకు వసంతం తిరిగొచ్చింది" అంటూ భార్య చేతిని చేతుల్లోకి తీసుకుంటూ ప్రేమగా చెప్పాడు సుధాకర్.


    అరమోడ్పు కనులతో భర్తను ఆరాధనగా చూసింది లలిత!!*

      

     

      

      

     .


Rate this content
Log in

Similar telugu story from Inspirational