Dr.R.N.SHEELA KUMAR

Inspirational

3  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

స్నేహమా నీకు వందనం

స్నేహమా నీకు వందనం

2 mins
281


జీవిత చిన్నప్పటినుండి కమల్, కవిత లతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండేది. జీవిత స్కూల్ లో చదువుకున్న కాలంలో రోజు ఎదో ఒక పిర్యాదు రాజగోపాల్ జమిందరు గారింటికి వస్తూనే ఉంటుంది. మీఅమ్మాయి జీవిత ఇది చేసింది అది చేసింది అని తల్లి మందలిస్తే తండ్రి బుజ్జగిస్తాడు. పుట్టినప్పుడే ధనవంతురాలిగా పుట్టిన ఆ హోదా ఎప్పుడు చేపించేది కాదు అందరితో కలుపుగోరుతనం తో డిగ్రీ వరకు అలానే వ్యవహరిస్తూ వచ్చేది. కవిత చాలా బీద రైతు కుటుంబం లో పుట్టింది కాలేజీ ఫీజులు కూడా జామిందారుగారే కేట్టేవారు. కమల్ డిగ్రీ చదివేటప్పుడే మిలిటరీ ట్రైనింగ్ కు వెళ్ళాడు. స్నేహితులందరికీ తనంటే చాలా గౌరవం. ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని జీవిత, కవిత ఉద్యోగాలకు పట్టణం వెళ్ళరు అక్కడ జమిందరు గారు వాళ్ళకి ఏ కొరత లేకుండా చూసుకోవడానికి ఓ వంటమనిషి, కారు డ్రైవర్ అన్ని సమాకూర్చారు. ఆఫీస్ లో వెళ్లిద్దరూ స్నేహితుల అక్కాచెల్లెళ్ళ అన్నట్లుండేవారు.

ఇలా ఓ సంవత్సరం గడిచింది ఆఫీస్ లో వీళ్ళ పై అధికారి వీళ్లిద్దరితో చాలా చనువుగా ఉంటాడు. తనకి వేళ్ల గురించి ఏమీ తెలియదు అదేనోమో తొలిప్రేమ అంటే. ఆఫీసర్ జగన్ కవితను ఇష్టపడ్డాడు. అది నేరుగా కవితకు చెపుతాడు. ఇలానే జీవిత జగన్ ను ఇష్టపడుతుంది అది చెప్పాలి అనుకునేలోపు కవిత, జగన్ ల ప్రేమ వివరాలు తెలిసి తన ప్రేమను చెప్పకుండానే దాచేస్తుంది. జీవిత వాళ్ళ నాన్నతో ఈ ప్రేమ వివరాలు చెప్పి వాళ్ళ పెళ్లి చేయిస్తుంది. పెళ్ళికి కమల్ వచ్చి జీవితను నువ్వు నాకు ఉత్తరంలో మరునాడు నీ ప్రేమ విషయం జగన్ కు తెలియజేస్తానన్నావు, కానీ ఇప్పుడు కవితకు ఇచ్చి పెళ్లిచేస్తున్నావ్, ఏమి జరిగింది అని అడిగాడు. తనకన్నా ముందే వెళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని అసలు తన ప్రేమ విషయం బయటపెట్టొద్దని చెప్పి కంటి తడిని తుడుచుకుంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. జమిందారు గారు ఇదంతా చూసి వేదనతో మంచం పడ్డారు ఆరు నెలలో జామిందారుగారు వారి భార్య చనిపోయారు జీవిత ఒంటరీదై పోయింది. కమల్ వచ్చి నువ్విలా ఒంటరిగా ఉండిపోతే కవిత కు విషయం తెలిసి తను నీకు ద్రోహం చేసాననే భాధ పడుతుంది కనుక నువ్వు ఎవరినైనా పెళ్లిచేసుకో, మేమందరం మా కుటుంబాలతో సంతోషంగా ఉండడానికి కారణమే నువ్వు అలాంటిది నువ్విలా మోడుల జీవించడం చాలా బాధాకరం అన్నాడు.

ఊరిలో ఓ డాక్టర్ మెడికల్ క్యాంపు పెట్టారు పేరు వినీత్. అతనిని చుసిన వెంటనే జీవితకు ఈ డాక్టర్ నాకు ముందే పరిచయమైయిన వ్యక్తిలా ఉన్నారే అంగుళం రోజు అతనితో కలిసి ఊరి జాన్సీలకు సేవ చేస్తూ ఉండేది. వినీత్ జీవిత కోసమే అక్కడకు వచ్చినట్లు తనతో ప్రేమ పంచుకున్నాడు. ఆ తరవాత జీవిత నేను చిన్నప్పటినుండి నిన్ను ప్రేమిస్తున్నాను నీతో కమల్ స్నేహంగా ఉండటం చూసి మీరిద్దరూ ఇష్టపడుతున్నారనుకొని నేను తప్పుకున్నాను. పోయిన నేల కమల్ తన భార్య తో మా ఆసుపత్రికి వచ్చాడు జరిగిందత చెప్పాడు. అప్పుడు నిర్ణయించుకున్నాను నువ్వు నా కోసమే పుట్టావు అని అందుకే ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టనుని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మరుసటి రోజు కమల్, కవితలు కుటుంబం సమేతంగా వచ్చి ఇద్దరి నిశ్చితార్ధం, పెల్లు 10రోజులలో చేసి అందరు సుఖంగా జీవించారు స్నేహమా నీకీ వందనం, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని త్యాగం చేసుకోవటమే స్నేహమంటే 


Rate this content
Log in

Similar telugu story from Inspirational