STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

సహనశీలి

సహనశీలి

2 mins
412


               "సహనశీలి"

              -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

 

    అనంతకు ఆరోజు చాలా గర్వంగా ఉంది...!!

    ఇన్నాళ్ళకైనా అత్తగారి మనసులో తాను స్థానం సంపాదించానని. ఆ కుటుంబంలో అనంత వీరనారిగా వెలుగొందినట్టే మరి. ఆకథ చెప్పాలంటే నీలవేణి గారిని తల్చుకోవాలి మరి.


    నీలవేణి ఎవరో కాదు. అనంత అత్తగారే. ముగ్గురు మగపిల్లల్ని కని పెంచింది. అందర్నీ ఒకేలా పెంచి పెద్ద చేసినా గానీ...వారి తెలివితేటలబట్టి చదువుల్లో ఆరితేరతారు. పెద్దవాడైనా సుందరానికి తప్ప రెండో వాడికీ మూడో వాడికీ బాగా చదువబ్బింది.


   పెద్దవాడు సుందరం ఇంటర్తో ఆపేయడంతో...వాళ్ళనీ వీళ్ళనీ పట్టుకుని ఓ గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా చేర్పించాడు భర్త బ్రతికుండగానే. ఆతర్వాత పిల్లల బాగోగులు చూడకుండానే గుండెపోటుతో హరీ మన్నాడు.

తర్వత మగపిల్లలిద్దరూ బాగా చదువుకోవడంతో మంచి ఉద్యోగాల్లో జాయినయ్యారు.


  పిల్లలు ఉద్యోగాల్లో సెటైలయ్యాకా తర్వాత బాధ్యత పెళ్లిళ్లు చేయడమే కదా...పెద్దవాడికి పెళ్ళైతేనే గానీ చిన్నవాళ్లిద్దరికీ చేయడం కుదరదని...పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టింది.


   అదిగో అలా పెద్ద కోడలుగా దొరికినమ్మాయే అనంత.

పెద్దకొడుకు పెద్దగా చదువుకోకపోవడంతో చిన్న ఉద్యోగం చేయడంతో సంబంధాలు ఏమీరాక... పెద్దగా కట్నకానుకలేమీ తెచ్చుకోలేని అనంత కోడలుగా వచ్చింది. పెద్ద కోడల్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగానూ ఉపయోగించుకునేది నీలవేణి. ఇంటెడు చాకిరీ చేయించడమే కాదు...కటనకానుకలు తెచ్చుకోలేదని అస్తమానూ సాధిస్తూనే ఉండేది. లేని కుటుంబం నుంచి రావడంతో అన్నీ సహిస్తూనే కాపురం చూసుకునేది అనంత. అలాంటి అత్తగారితో ఆఇంట్లో కాపురం చేయడం కూడా ధైర్యం కావాలి. సహనంతో పాటూ అలాంటి ఆసుగుణం ఉండటం ఆమె ఏనాడూ కృంగిపోలేదు.


   నీలవేణి చిన్నకొడుకుల ఇద్దరి పెళ్లిళ్ళూ కూడా చేసేసింది ఎంతో ఘనంగా. చిన్నకోడలిద్దరూ ఆస్తులు మూటకట్టుకు రావడంతో పెద్దకోడలు మరీ లోకువయ్యింది. ఎంతసేపూ చిన్న కోడళ్లను చూస్తూ మురిసిపోయేది. చిన్నమాట గానీ...పని గానీ చెప్పేది కాదు. 


   పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అధికారం చెలాయించే అత్తగారు దురదృష్టవాసత్తు కాలు జారి పడిపోయారు. నడుం విరిగడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆపరేషను చేసినా కొలుకోలేకపోవడంతో మంచాన్న పడ్డారు. 

మంచం మీదే సేవలు చేయించుకునే స్థితికొచ్చారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి సేవలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఇంట్లో తచ్చాడే చిన్నకోడలిద్దరూ ఆగది వైపు వచ్చి కనీసం పలకరించేవారు కాదు. 


  పలకరించేది... సేవలు చేసేదీ పెద్ద కోడలు మాత్రమే. 


  పగలనకా రాత్రనకా కంటికి రెప్పలా చూసుకుంటున్న అనంతను చూస్తుంటే.... కోడలెంతో మనసెంతో అనంతగా అనిపించింది నీలవేణికి.


  "అమ్మా అనంతా...ఇన్నాళ్లూ నిన్నెంతో బాధ పెట్టాను.పేదరికాన్ని చిన్నచూపుగా చూసి నీ మంచితనం గుర్తించలేకపోయాను. గొప్పవారింటి పిల్లలని చిన్నకోడళ్ళిద్దరూ నా రెండు కళ్ళూ అనుకున్నాను. ఇన్నాళ్లూ చాలా అజ్ఞానంలో గడపడం వల్ల ఎవరి మనసు ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను. నీలో భూమాతకున్న సహనం వుందమ్మా" అంటూ అత్తగారి నోటివెంట ఆ మాటలు వినేసరికి....అనంతకు ఎంతో ఆనందంతో పొంగిపోయింది. 


  ఇన్నాళ్ళకైనా అత్తగారు తనను కోడలుగా గుర్తించి భూమాతతో పోల్చినందుకు...అంతకన్నా దీవెన తనకేముంటుంది...?


   అందుకే అనంతకు చాలా గర్వంగా ఉంది.


   ఈ ఉమ్మడికుటుంబంలోని బాధ్యతలరంగంలో తానూ ఓ ఇల్లాలుగా ఎన్నో సమస్యల్ని సహనంతో ఎదుర్కొని... వీరనారి అయ్యాననే అనుభూతికి లోనయ్యింది అనంత...!*


         *****     *****    *****

   

   



Rate this content
Log in

Similar telugu story from Inspirational