శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

రుచే రుచి

రుచే రుచి

2 mins
276


     రుచే రుచి

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

           

  వాతావరణం చల్లగా ఉంది...!

  "మా అమ్మ వాము పులుసు పెట్టేది. నీకు వచ్చా" అన్నారు నాభర్త.


  వాముతో కూడా పులుసా...? చాలా వింతగానూ ఆశ్చర్యంగానూ అడిగాను.


  "చాలా బాగుంటుంది. నువ్వు ఒకసారి రుచి చూసావంటే మరోమారు వేసుకుని తింటూనే ఉంటావు" ఈచల్లటి వాతారణంలో నాకెలాగైనా ఈరోజు తినాలని ఉంది" అన్నారు పదే పదే తలచుకుంటూ.


  ఆయనంతగా తల్చుకుంటుంటే జాలేసి... పాపం వండి పెడదాంలే అనుకున్నాను. కానీ నాకు రాదు కదా...


   వెంటనే విశాఖలో ఉన్న అత్తయ్యగారికి ఫోన్ చేసాను.


   "అత్తయ్యా...నేనేమో మా అమ్మ దగ్గర నేర్చుకున్న కూరలే రుచిగా ఉంటాయని అలాగే వండిపెడుతున్నాను. నేను వండిన కూరలకెప్పుడూ మీ అబ్బాయి వంకలు పెట్టలేదు. గానీ....ఈమధ్య ఎక్కువుగా మీరు వండే వంటలనే పదేపదే తల్చుకుంటున్నారు. ఆమధ్య అల్లం పులుసు అంటే మిమ్మల్ని అడిగి ....అచ్చం మీరు చెప్పినట్టే చేసాను. నాకెంతో బాగా నచ్చింది. అయినా మా అమ్మ చేసినట్టుగా రుచి రాలేదు అన్నారు. ఇప్పుడేమో వాము పులుసు తినాలని కోరిగ్గా ఉందంట. అది కూడా ఎలా చేయాలో చెప్తే నేర్చేసుకుంటాను. ఎంతైనా తల్లి వంటకాలు బిడ్డలకెప్పుడూ పంచామృతాలే కదత్తయ్యా. ఈయనకు నచ్చినా నచ్చకపోయినా నాకో కొత్త రెసిపీ వచ్చిందనుకంటాను" కాస్త విపులంగా చెప్పరూ" అంటూ అడిగాను.


  నేను చెప్పింది అంతా విన్నాకా అత్తయ్య పెద్ద క్లాసే పీకారు నాకు . 

   

  "అవును మరి ఎప్పుడూ చికెన్లూ,మటన్లూ, చేపల పులుసులూ చేస్తూ ఉంటావు గానీ అప్పుడప్పుడు ఇలాంటి వాము పులుసులు, అల్లం పులుసులు, పసుపు పులుసులూ పెట్టుకుంటే ఒంట్లో ఎలాంటి పైత్యాలూ ఉండవు. ఏ కడుపునొప్పులూ లేకుండా అరుగుదల కూడా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రోగనిరోధకంగా పనిచేస్తాయి. వామ్ము పులుసు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అల్లం పులుసు పెట్టినట్టే ...అల్లానికి బదులు వాము తీసుకుని చేస్తావు" అంటూ చెప్పారు. ఆవిడ చెప్పినదంతా విన్నాకా ఓస్ ఇంతేనా' 'అనిపించింది. 

   

   "సరే అత్తయ్యా వాము పులుసు పెట్టి...వడియాలు, అప్పడాలు వేయించి మీ అబ్బాయికి పెడతాను కదా"...అంటూ ఫోను పెట్టేసాను.


   వంట గదిలోకి వెళ్లి అత్తయ్య చెప్పినట్టుగా కావాల్సినవి తీసుకుని చకచకా చేసేసాను. వాము పులుసు మరుగుతుంటే ఉంది...ఘుమఘుమలాడుతూ నిజంగానే ముక్కుపుటాల్ని అదరగొట్టేసింది. ఇక తింటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.


   ఆ ఘుమఘుమలకు అన్నం ఎప్పుడు ఉడుకుతుందా అన్నట్టు నిరీక్షిస్తున్నారు మావారు. మా వారికి వారమ్మచేతి వంట పెట్టబోతున్నందుకు నాకూ సంతోషంగా అనిపించింది. 


   వంట అంతా రెడి అయ్యాకా...ఇద్దరూ పోటాపోటీగా వడియాలు నంచుకుంటూ... పులుసంతా దాదాపు కాళీ చేసేసాము. మొదటిసారి చేసినా చాలా బాగా పెట్టావోయ్" అన్నారు మావారు. ఆయనలా మెచ్చుకునేసరికి ఎంతో గర్వంగా ఫీలయ్యాను.


   ఆ వాము పులుసు గురించి అమ్మకి చెప్తే..."ఇవన్నీ తూర్పున వుండేవాళ్ళు ఎక్కువుగా పెట్టుకుంటారు" అంది అమ్మ. 


  "ఏమోనమ్మా...ఎప్పుడూ తూగో జిల్లా వంటలే గొప్పనుకోకూడదు. అన్ని ప్రాంతాల్లోని వంటలూ తిన్నప్పుడే కదా వారి రుచులు కూడా తెలుస్తాయి. ఈసారి నేను కాకినాడ వచ్చినప్పుడు వండుతాను. రుచి చూసాకా అప్పుడు చెప్పు" అన్నాను.


   అన్నట్టుగానే...కాకినాడ వెళ్ళినప్పుడు ఈ వాము పులుసుతో పాటూ అల్లం పులుసు కూడా పెట్టి రుచులు చూపించాను. అంతా ఇష్టంగా తింటుంటే...ఇవి మాత్రం మాఅత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న స్పెషల్ పులుసులు. ఎవరికోగానీ సరిగా తెలియని రెసిపీలు" అన్నాను.


   అమ్మ ముసిముసిగా నవ్వింది. 


   నాకు అమ్మ వంటలెంత ప్రియమో...అలాగే నాభర్తకు కూడా తన అమ్మ వంటలు అంతేప్రియంగా ఉంటాయి మరి. అందుకే అత్తగారి చేసే వంటకాలు కూడా అడిగి చాలా నేర్చుకుని చేసి పెట్టాను. ఆయనెంతో తృప్తిగా తింటుంటే నావంట కూడా పంచామృతమే అనిపించింది.



Rate this content
Log in

Similar telugu story from Inspirational